Saturday, April 30, 2011

HYDERABAD CENTRAL UNIVERSITY...!!!

      హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(HCU) ...రెండు సంవత్సరాలు ...ఒక కొత్త జీవితం ...!!!
ఈ కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు నా మనసులో ఏ విధమైన అభిప్రాయం ఉందో చెప్పడం కష్టం...!నాకు, నేనేంటో తెలిసేలా నాకు స్నేహితులని ఇచ్చి, ఆ స్నేహితుల ద్వార ఒక కొత్త ప్రపంచాన్ని నా ముందు ఉంచింది ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం! ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే నా మనసులో ఏదో విలువ తెలియని, వెలకట్టలేని ఒక గౌరవం ఉంది. కాని ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంపై కోపం కుడా ఉంది ...!!
      ఎందుకంటే, నాకు కొత్త ప్రపంచాన్ని, నన్ను నన్నుగా చూసే స్నేహితులను అందించిన ఈ విద్యాలయమే...ఇప్పుడు ఈ రెండింటిని నా నుండి వేరు చేస్తోంది.
      ఏది ఎలా ఉన్నా... ఈ విశ్వవిద్యాలయంలో నా రెండు సంవత్సరాల పి.జి. ( post graduation) నా జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక సంచలనం, ఒక ఆనందం, ఒక బాధ మరియు ఒక కోపం! నన్ను నన్నుగానే ఉంచుతూ, నా మనసులోని భావాలను పంచుకుంటూ, వారి భావోద్వేగాలను నాకూ పంచుతూ...నా జీవితంలో స్నేహం అనే పదానికే ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారు నా స్నేహితులు !!!ఇప్పుడు నా జీవితాన్ని నేను రెండు భాగాలుగా విభజించుకోగలను. ఒకటి ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసానికి ముందు, రెండు ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం తరువాత...!
      నా జీవితానికి కొత్త దారిని చూపి, నన్ను అదే దారిలో నా జీవితాంతం నడిచే విధంగా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, అలాగే నా స్నేహితులకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను........!!!



DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, April 17, 2011

IVI LEKUNDA...!!!

ప్రేమించు...అసహ్యానికి స్థానం లేకుండా...!
జీవించు...రేపటి మీద ఆలోచన కోల్పోకుండా...!
హృదయాలను గెలువు...మంచికి మరుపు లేకుండా...!
బాధను అనుభవించు...ఒంటరితనం లేకుండా...!
సహాయాన్ని అందించు...'ఎవరు?' అనే ప్రశ్న లేకుండా...!
నమ్మకంతో ఉండు... నయవంచనకు స్థానం లేకుండా...!



DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, April 12, 2011

ILAA UNTE...?!

   నువ్వు ఒక పునాదిగా ఉండు...నీ మదిలోని ప్రేమను, బాధను, నిజాలను, రహస్యాలను, దయా గుణమును 
ఎదుటివారికి పంచుతూ...వారి హృదయాలనుండి కూడా వాటిని స్వీకరించు...!!!
ఒక వస్తువు పోతే, దానిని తిరిగి సాధించుకునే అవకాశం ఉంది...కానీ, గడిచిపోయిన జీవితాన్ని తిరిగి సాధించలేము...!
ఒక వ్యక్తి మౌనంగా ఉంటే...దాని అర్థం, ఆ వ్యక్తికి ఏమీ తెలియదని కాదు...ఆ వ్యక్తి జీవితం నేర్పిన పాఠాలు, ఆ మౌనానికి    కారణం కావచ్చు...!!!


DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Saturday, April 2, 2011

02-04-2011.....!!!

యుగాది (ఉగాది) ముందుగానే వచ్చిన రోజు ...
దేశంపై ప్రేమ ఏవిధంగా ఉంటుందో...మనస్సాక్షిగా అనుభవించిన రోజు ...
భారతదేశం అంటే గర్వపడిన రోజు ...
నా దేశం దేన్నైనా సాధించగలదు...
ఈ దేశంలో పుట్టిన నేను కూడా దేన్నైనా ఛేదించి సాధించగలనని, నాలో ఆత్మవిశ్వాసం గర్జించిన రోజు...
నేనూ నా దేశానికి ఏదైనా చేయాలి ..అన్న భావనను నా మనసులో పుట్టించిన రోజు ...
అఖండ భారతావని మొత్తం చిరు దరహాసాలతో ఊయలలా ఊగిన రోజు ...
నేనూ నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిని మిగిల్చిన రోజు ...
మన భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా అవతరించిన రోజు ...02-04-2011.....!!!


DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.