Tuesday, July 30, 2013

AALOCHINCHU...!!!

కల నెరవెరబోతున్న వేళ ...
కళ కనుమరుగై పోతుందా ...?!
తీరం అంచున ఉండి... 
సముద్రం నాది అంటే ఎలా ...?!
నడక నీదై ... నడవడిక మరొకరిదై ..
దారి ఇంకొకరిది అయితే ..?!
గందరగోళ పరిస్థితి ...
 ఎవరికి... ఎవరికోసం ...?!
నీకోసం ఆలోచించు ...
అది అందరికీ ఉపయోగపడేలా చూడు ...!!!

Tuesday, July 2, 2013

NEEVE...NENU...!!!

నిన్నుతాకిన ప్రతీ కణం
నీ  స్పర్శనే కోరుకుంటోంది ...
నీ ధ్యానమెరిగిన ప్రతీ కణం
నీవే ధ్యాస అంటోంది ...
నీ చూపు తెలిసిన ప్రతీ కణం
నీవే దైవమంటోంది ...
నీ నడక తెలిసిన ప్రతీ కణం
అదే దారి అంటోంది ...
నీ నీడ తాకిన ప్రతీ కణం
అదే చలువ అంటోంది ...
నీ ఆలోచనలే ... వాటి ఆయువంటున్నాయి ...!!!

Thursday, April 18, 2013

LAYA...!!!

నిన్ను తలిచిన ప్రతిక్షణం...
నాలో కదులును హృదయ కణం...!
దిశలేని ఆలోచన నీవైపు కదిలెను...
నిన్ను చూసిన మరుక్షణం... !
నా మనసు అయ్యింది నీకై ఒక ఆలయం...
నా దేహం అయ్యింది భక్తిమయం...!
నా  మాటలు నీకై అయ్యాయి కోటలు...
ఇక ఎప్పుడూ పడవు నా ప్రేమకు బీటలు... !
లయ తప్పింది నా  అడుగు నిన్ను చూడగానే...
ప్రేమాలయం అయ్యింది నీతోవేసే ప్రతి అడుగు...
నీ ప్రేమను పొందగానే .... !!!

Friday, January 4, 2013

KOTHA SAMAYAM...!!!

2012 వింత వింత అనుభవాల్ని మిగిల్చి వెళ్ళింది. 2013 మాత్రం మొదటి  రోజు  నుండే అనుకోని సంఘటనల సమాహారంతో ఆరంభమైంది. ఇది నా మిగతా సంవత్సర కాలం ఎలా ఉండబోతోందో తెలియజేసే సంకేతమనుకుంటాను. రెండో రోజు అనుకోని మలుపులతో కాస్త చిలిపిగా ... మరికొంత బాధ్యతగా గడిపిన క్షణాలతో ముగిసింది. నేను నా సమయాన్ని ఎలా గడపాలో... ఎలా గడపబోతున్నానో  పరోక్షంగా ఒక మార్గాన్ని నా ముందు ఉంచిన 2013 సంవత్సరపు మొదటి రెండు రోజులను నేను నా జీవితంలో మరిచిపోలేను. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.