Thursday, December 22, 2011

AUTO RAMANNA...!!!

   నేను ఆటోలో ప్రయాణిస్తుండగా ...వేరొక ఆటోపై రాసి ఉన్నటువంటి ఒక కవిత నా హృదయాన్ని ఎంతగానో హత్తుకుంది. ఆ కవిత్వాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది... అందుకే ఆ ఆటో రామన్న కవిత్వాన్ని మీతో పంచుకుంటున్నాను.
"కవి కవిత్వాన్ని మరచినా ...
కోకిల గానం మరచినా ...
నువ్వు నన్ను మరచినా...
నేను నిన్ను మరువను ...!!!"
                                     -ఆటో రామన్న
ఇష్టపడ్డ మనిషి మరిచిపోయినా... ఆ మనిషిని ఇష్టపడ్డ మనసు ...ఆ మనిషిని ఎన్నటికీ మరువదు... అన్న విషయాన్ని చాలా అందంగా చెప్పిన ఆ ఆటో రామన్నకి నా జేజేలు!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Saturday, November 12, 2011

MANCHI...!!!

మంచి లక్షణం ... అందానికి ఉన్న వెనుకబాటుతనాన్ని కనబడకుండా చేస్తుంది...! కానీ, అందం ఎప్పుడూ మంచిలో వెనుకబాటుతనాన్ని ముసుగు రూపంలో కనబడకుండా చేయలేదు!!! సహృదయం  మరియు మంచితనం రెండూ  విభిన్న అంశాలు.. సహృదయం ఎన్నో బంధాలని గెలువవచ్చు... అదే మంచితనం, జీవితాంతం ఒక బంధాన్ని నిలుపుతుంది...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Monday, October 24, 2011

KAALAM...LAKSHYAM...!!!

పరీక్షాకాలం మొదలైంది ...
సమయపాలనకు సమయం ఆసన్నమైంది ...
కాలంతో పోటీపడే దీక్ష ...
అదే  భవిష్యత్తుకి రక్ష ...
కాలంతో కాలయాపన చేసే సమయం కాదిది ...
సమయాన్ని  సంయమనంతో వాడుకోవలసిన సమయమిది ...
భవిష్యత్తు ఒక వ్యధగా కాకుండా ఉండాలంటే ...
సమయాన్ని వృథా చేయకుండా ...
లక్ష్య సాధనకై పనిచేయడం సరియైన పని ...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, September 15, 2011

AASHA...NIRAASHA...!!!

                ఒక నిరాశావాది రెండు రాత్రుల మధ్యన ఒక రోజు ఉంటుందనుకుంటాడు. ఆశావాది రెండు రోజుల మధ్యన ఒక రాత్రి ఉంటుందనుకుంటాడు! ఆశావహ దృక్పథంతో ఉన్నవారిని ఏ విషమూ చంపలేదు, అలాగే నిరాశావాదిని ఏ మందు కూడా బాగు చేయలేదు! మనం  జన్మించిందే దేన్నైనా సాధించటానికి ...! అనుకూలతల కోసం వెతుక్కునేకన్నా, ఓపికతో సాధించడం మిన్న...!! ఏదైనా చిన్న స్థాయి నుండి ప్రారంభించడం ఉత్తమం. ఎందుకంటే, పెద్ద స్థాయిలో నిలబడాలంటే ప్రాథమిక అనుభవం ఎంతో అవసరం...!!! ఎప్పుడైనా సరే గెలుపు గురించి చర్చించకండి... ఓటమి గురించి బాధ పడకండి!!!   

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles. 

Tuesday, August 16, 2011

KATHTHI...!!!

   అసంతృప్తిలో 'సం'తృప్తిని వెతికినా...అదో సుత్తి లా ఉంది. కానీ, అదే విజయానికి ఒక కత్తి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాను. విజయానికి ఉపయోగపడే కత్తి కోసం ఎదురుచూస్తున్న నాకు...కొవ్వొత్తులను పెట్టి, నాలో ఉన్న అసంతృప్తిని పెంచి ... సంతృప్తి చెందాలని అనుకుంటున్నారు కొందరు... వారి సంతృప్తే ఆ కొవ్వొత్తులని వెలిగిస్తే... వాటి వెలుగే నా విజయానికి కారణమయ్యే కత్తి అవుతుందని భావిస్తున్నా...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles. 

Wednesday, July 27, 2011

CHINNA KORIKA...!!!

మంచి మనిషి గా ...మంచి మనసున్న వ్యక్తిగా...
స్నేహం కోరే మనిషిగా ...స్నేహంగా ఉండే వ్యక్తిగా ...
మేలు కోరే మనిషిగా ...ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ...
కష్టంలో ఆనందాన్ని ఆస్వాదించే మనిషిగా ...
ఆ ఆనందంలో అందాన్ని వెతికే వ్యక్తిగా ...
.....................................................
........................ఉండాలని ఆశిస్తూ ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు ...!!!
                                                    ఇట్లు,
                                                నీ శ్రేయోభిలాషి.

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles. 

Thursday, July 21, 2011

CHINNI MANASU...!!!

      మనసు ఒక బంధాన్ని చూసి మురిసి పోయింది ...అలాంటి బంధమే తనకు కూడా కావాలని ఆశ పడింది. ఆ బంధం కోసం ఎన్నో రోజుల నిరీక్షణ... ఇతర మనసులకు అది ఒక వింతగా ఉంది, కానీ ఆ నిరీక్షించే మనసుకు మాత్రం అది ఒక ఆనందంతో కూడిన తపస్సులా ఉంది...! చివరిగా ఆ మనసు నిరీక్షణ ఫలించింది...తను నమ్మే మనసు తన కళ్ళ ముందే ఒక పరిచయంగా ఎదురుపడింది...ఈ పరిచయం, పరిచయంగానే ముగియకూడదని ఆ తపో మనస్సు భావిస్తోంది...!కానీ, ఆ మనసుకి ఒక మూలాన ఒక చిన్న సందేహం...ఈ పరిచయం ఒక బంధంగా మారితే, తన చుట్టూ ఉన్న ఇతర మనసులు ఆ బంధం గురించి ఏమనుకుంటాయో అని ...?! మనసు తన ఆరాటానికి, తన ఆరాధ్యానికి, తన ఫలించిన వరానికి ఏమి సమాధానం చెప్పాలి...?! ఇదే బంధాన్ని, తనకు పరిచయమైన మనసే తప్పుగా భావిస్తే ...ఆ మనసుకు ఏమని సమాధానం చెప్పాలి...?! 
          చిన్ని మనసు మూగబోతోంది...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, June 21, 2011

NAANNA...!!!

    నాన్న ..."నా" అని నేను గర్వంగా చెప్పుకోవడానికి ఈ ప్రపంచం లో నేను బ్రతకడానికి దేవుడు నాకు ప్రసాదించిన రెండు వరాలలో ...మొదటి వరం...!!! నాన్న... ఈ నేలపై నా ప్రయాణం మొదలైన రోజు నుండి నాకోసమై ఉన్నవాడు...నన్ను నడిపిస్తున్నవాడు ...నన్ను నన్నుగా చూస్తున్నవాడు  ...!!! నాన్న...నాకు ప్రేమను మాత్రమే పంచుతూ, బాధను తన దగ్గరే ఉంచుకుంటున్నవాడు ...నా కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ , తన సంతోషాన్ని నాకు పంచి ఇస్తున్నవాడు ...!!! నాన్న ... జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పినవాడు...నా జీవితానికే ఒక అర్థం ఇచ్చినవాడు...!!! నాన్న ...నాకు ఆదర్శంగా నిలిచినవాడు...ఆదర్శానికే ఆదర్శంగా ఉన్నవాడు ...!!! 

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, May 15, 2011

AALASYAM... AMRUTHAM....VISHAM.....!!!

స్నేహం ఒక మరిచిపోలేని మధుర జ్ఞాపకాల సమాహారం...!
ఆ పాత మధురిమ స్నేహపు చేష్టలను నెమరువేసుకున్న, అది ఒక అవతారం...!
ఆ స్నేహ సరిగమల జ్ఞాపకాలతో...
పాత స్నేహం ఎదురైంది ఆలస్యంగా...!
ఈ ఆలస్యమే...నా మదిలో దాగిఉన్న...
స్నేహ పరిమళాల పాలిట అయ్యింది అమృత ధారగా ...!
ఈ అమృత ధారే ఆ పాత స్నేహంపట్ల...
మారింది ఒక స్నేహామృత సాగరంగా ...!
ఈ స్నేహామృత సాగర విషయమే...
ఆ పాత స్నేహానికి అయ్యింది విషమంగా...
తన ఊహలో ఒక విషంగా...!!!

   DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Saturday, April 30, 2011

HYDERABAD CENTRAL UNIVERSITY...!!!

      హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(HCU) ...రెండు సంవత్సరాలు ...ఒక కొత్త జీవితం ...!!!
ఈ కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు నా మనసులో ఏ విధమైన అభిప్రాయం ఉందో చెప్పడం కష్టం...!నాకు, నేనేంటో తెలిసేలా నాకు స్నేహితులని ఇచ్చి, ఆ స్నేహితుల ద్వార ఒక కొత్త ప్రపంచాన్ని నా ముందు ఉంచింది ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం! ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే నా మనసులో ఏదో విలువ తెలియని, వెలకట్టలేని ఒక గౌరవం ఉంది. కాని ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంపై కోపం కుడా ఉంది ...!!
      ఎందుకంటే, నాకు కొత్త ప్రపంచాన్ని, నన్ను నన్నుగా చూసే స్నేహితులను అందించిన ఈ విద్యాలయమే...ఇప్పుడు ఈ రెండింటిని నా నుండి వేరు చేస్తోంది.
      ఏది ఎలా ఉన్నా... ఈ విశ్వవిద్యాలయంలో నా రెండు సంవత్సరాల పి.జి. ( post graduation) నా జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక సంచలనం, ఒక ఆనందం, ఒక బాధ మరియు ఒక కోపం! నన్ను నన్నుగానే ఉంచుతూ, నా మనసులోని భావాలను పంచుకుంటూ, వారి భావోద్వేగాలను నాకూ పంచుతూ...నా జీవితంలో స్నేహం అనే పదానికే ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారు నా స్నేహితులు !!!ఇప్పుడు నా జీవితాన్ని నేను రెండు భాగాలుగా విభజించుకోగలను. ఒకటి ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసానికి ముందు, రెండు ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం తరువాత...!
      నా జీవితానికి కొత్త దారిని చూపి, నన్ను అదే దారిలో నా జీవితాంతం నడిచే విధంగా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, అలాగే నా స్నేహితులకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను........!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, April 17, 2011

IVI LEKUNDA...!!!

ప్రేమించు...అసహ్యానికి స్థానం లేకుండా...!
జీవించు...రేపటి మీద ఆలోచన కోల్పోకుండా...!
హృదయాలను గెలువు...మంచికి మరుపు లేకుండా...!
బాధను అనుభవించు...ఒంటరితనం లేకుండా...!
సహాయాన్ని అందించు...'ఎవరు?' అనే ప్రశ్న లేకుండా...!
నమ్మకంతో ఉండు... నయవంచనకు స్థానం లేకుండా...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, April 12, 2011

ILAA UNTE...?!

   నువ్వు ఒక పునాదిగా ఉండు...నీ మదిలోని ప్రేమను, బాధను, నిజాలను, రహస్యాలను, దయా గుణమును 
ఎదుటివారికి పంచుతూ...వారి హృదయాలనుండి కూడా వాటిని స్వీకరించు...!!!
ఒక వస్తువు పోతే, దానిని తిరిగి సాధించుకునే అవకాశం ఉంది...కానీ, గడిచిపోయిన జీవితాన్ని తిరిగి సాధించలేము...!
ఒక వ్యక్తి మౌనంగా ఉంటే...దాని అర్థం, ఆ వ్యక్తికి ఏమీ తెలియదని కాదు...ఆ వ్యక్తి జీవితం నేర్పిన పాఠాలు, ఆ మౌనానికి    కారణం కావచ్చు...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Saturday, April 2, 2011

02-04-2011.....!!!

యుగాది (ఉగాది) ముందుగానే వచ్చిన రోజు ...
దేశంపై ప్రేమ ఏవిధంగా ఉంటుందో...మనస్సాక్షిగా అనుభవించిన రోజు ...
భారతదేశం అంటే గర్వపడిన రోజు ...
నా దేశం దేన్నైనా సాధించగలదు...
ఈ దేశంలో పుట్టిన నేను కూడా దేన్నైనా ఛేదించి సాధించగలనని, నాలో ఆత్మవిశ్వాసం గర్జించిన రోజు...
నేనూ నా దేశానికి ఏదైనా చేయాలి ..అన్న భావనను నా మనసులో పుట్టించిన రోజు ...
అఖండ భారతావని మొత్తం చిరు దరహాసాలతో ఊయలలా ఊగిన రోజు ...
నేనూ నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిని మిగిల్చిన రోజు ...
మన భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా అవతరించిన రోజు ...02-04-2011.....!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, March 27, 2011

JEEVITHAM.....!!!

       అందమైన జీవితం ఊహాజనితమైనది... నిజ జీవితం ఊహ కంటే అందమైనది ...జీవితంలో స్నేహం ప్రేమలాంటిది, ఆ స్నేహమే ప్రేమ కూడా కావచ్చు...! తీపి జ్ఞాపకాలు, గడిచిన జీవితాన్ని తీసుకురాలేవు ...చక్కటి ప్రేమబంధంతో అనుభవాలను హృదయంలో నిలుపుకోవచ్చు ...!కొత్త ప్రేమ ముగింపు జీవితంలో కూడా కొత్తగానే ఉండటం చాలా అరుదు...కానీ, దీనిని సాధించవచ్చు...! మంచి జీవితం కోసం కొన్ని విషయాలను వదులుకోవడంలో తప్పులేదు ...కానీ , మంచి జీవితాన్ని అన్ని విషయాలకోసం వదులుకోవడం తప్పు...! నువ్వు ప్రపంచాన్ని అనుసరించకు ...నీ జీవితాన్ని అనుభవించు...జీవితంలో జీవించు ...జీవితాన్ని ప్రేమించు ...! అప్పుడు ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది ...!!!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, March 24, 2011

SPANDANA...........!!!

సమయం లేని సమయాన ...సంయమనం కోల్పోయి ....
సమన్వయ లోపంతో ఉన్న హృదయస్పందన.....
నీ ప్రతిస్పందనకై ఎదురుచూస్తోంది .....!
నీ పరిచయం ఒక ప్రేరణ అయి ....
ఆ ప్రేరణే ప్రేమ అయి .....
ఆ ప్రేమే ప్రాణం అవుతుందేమో  ...?!
ఈ పసి మనసు ...పెద్ద మనసు అవుతుందేమో ...?!
మనసు పెద్దదైనా.....మనసు మూగదై....
నా మాట మసకబారింది ..!!!
అందుకే ..ఏ సమయంలోనైతే నిన్ను చూస్తానో .....
అదే సమయంలో నా మనసు ...సంయమనంతో ....
సమన్వయంతో ...నీ ప్రతిస్పందనకు ...
స్పర్శతో స్పందిస్తుంది .....!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Wednesday, March 16, 2011

JEEVITHAM...PREMA....SNEHAM.....!

      జీవితం కోసం ప్రేమ , స్నేహం ఉన్నాయి.ఒక స్నేహం కోసమే బ్రతికే ...అలాగే ఒక ప్రేమ కోసమే బ్రతికే జీవితాలు ఎన్ని ఉన్నాయి ..?! ఇది చెప్పటం కష్టం. జీవితంపై ప్రేమను పెంచుకోవాలి ....అదే ప్రేమను పంచుకోవడానికి ఒక స్నేహాన్ని అన్వేషించాలి...! మరి ఆ స్నేహం మనం పంచే ప్రేమ కోసం ఉందా..?! లేక తన జీవితంపై ప్రేమను ఈ స్నేహం ద్వారా పొందాలని చూస్తోందా...?! అంటే చెప్పటం కష్టం ..! ఎందుకంటే జీవితం పంచే ప్రేమకు స్నేహం ఇచ్చే విలువ ..ఆ ప్రేమకు కూడా తెలియదు ....! అందరి విషయంలో ఎక్కువగా జరిగేది ఇదే ...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, March 13, 2011

CHIRUNAVVU.........!

చిన్న చిరునవ్వు నీలోని బాధని తొలగిస్తుంది ..!
చిన్న చిరునవ్వు నిన్ను మృదువుగా ఉంచుతుంది ..!
చిన్న చిరునవ్వు నీలో ధైర్యాన్ని నింపుతుంది ..!
చిన్న చిరునవ్వు నీకు విజయాన్ని అందిస్తుంది ..!
నీలోని చిన్ని బాధ ..ఎదుటివారికి "నవ్వు"నిస్తుంది ..!
కానీ ..అదే చిరునవ్వు ఎదుటివారికి బాధనీ కలిగిస్తుంది ..! 
చిరునవ్వు ఒక వజ్రం లాంటిది ........
సాన బెట్టిన వజ్రానికే అధిక విలువ ఉంటుంది .....
చిరునవ్వు కూడా పెదాలపై ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది ...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, March 10, 2011

NEELO MAARPU........!

అందరూ సంతోషంగా ఉంటారు నీవల్ల ..!
ఎందుకంటే ...వారి కోసం నీ సంతోషాన్ని వదులుకోవడం వల్ల...!
నువ్వు సంతోషంగా ఉంటావు అందరివల్ల ...!
ఎందుకంటే ...ఇతరుల లోపాలను నువ్వు వదిలేయడం వల్ల ...!
"నువ్వు" అనేది వస్తుంది ...నీలో పదిమంది ఉండటం వల్ల ...! 
"నేను" అనేది వస్తుంది ...నీలో నువ్వు ఉండటం వల్ల ...!
జీవితం అవుతుంది స్వార్థ పూరితం ...
అన్నీ కావాలనుకోవడం వల్ల ...!
వాటి విలువ తెలియదు ...
అన్నీ ఉండటం వల్ల ...!
నీ భవిష్యత్తు మారదు ....నీ చేతల వల్ల ...!
కాని నీ చేతలు మారుతాయి ...నీ మారిన గుణం వల్ల...!
అప్పుడు నీ భవిష్యత్తు మారుతుంది ...నీ మారిన చేతల వల్ల ...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, March 3, 2011

BANDHAM.....!

ప్రేమించే వారితో ఉండటం జీవనం .....!
ప్రేమించే చేతిలో ప్రాణాలు విడువడం జీవితం ....!
స్నేహంగా ఉండటం జీవనం .....!
స్నేహం కోసమే ఉండటం జీవితం ....!
బంధం ఒక జీవనం ...!
బంధాలను తెంచుకోవడం ఒక మూర్ఖత్వం ...!
 బంధాలను ప్రాణంగా మలుచుకోవడం జీవితం .....!
స్నేహంలో ప్రేమను ......ప్రేమలో స్నేహాన్ని ....
ఈ రెండింటి బంధాన్ని ....అర్థం చేసుకోగలదు 
ఒక మంచి మనస్తత్వం .....
....బంధం ..... కలల ఆధారితం ...!
మంచి మనసుతో ఒక కళలా చూస్తే ...
అవుతుంది బంధానికి ఒక హృదయ సాక్షాత్కారం ...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, February 27, 2011

NUVVU EVARU......?!

నువ్వు ఎవరు ...నన్ను విసిగించడానికి ......?!
నువ్వు ఎవరు ...నన్ను ప్రశ్నించడానికి ......?!
నువ్వు ఎవరు ...నన్ను శిక్షించడానికి ........?!
నువ్వు ఎవరు ...నన్ను నిందించడానికి .......?!
నువ్వు ఎవరు ...నన్ను వద్దనడానికి ............?!
నువ్వు ఎవరు ...నన్ను బాధించడానికి .......?!
నువ్వు ఎవరు ...నన్ను అయోమయం చెయ్యడానికి ......?!
నువ్వు ఎవరు ...నాకు దారి చూపడానికి .......?!
నువ్వు ఎవరు ...నాకు నచ్చిందనడానికి.......?!
నువ్వు ఎవరు ...నాకు సమాధానం చెప్పడానికి .....?!
నువ్వు ఎవరు ...నాపై నిర్ణయం తీసుకోవడానికి ......?!
నువ్వు ఎవరు ...నేను .....నాపై .....ఆలోచించడానికి ......?!
...................................................ఎందుకంటే ........
నేను నీ మనసుని .......................!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, February 24, 2011

MARO MANISHI....!

గతం చెబుతుంది ఎవరూ పరిపూర్ణులు కారని .....
అందరూ లోపం గలవారని .......
భవిష్యత్తు చెబుతుంది అందరూ మారుతారని .....
వర్తమానం చెబుతుంది ఈ మార్పుకై కృషి చేయాలని ......
మనసు చెబుతుంది అనుకున్నది సాధించగలమని ....
నమ్మకం చెబుతుంది కష్టం ఎన్నడూ వృథాకాదని .....
ఆత్మ విశ్వాసం చెబుతుంది అనుకున్నది చేయగలమని .......
ధైర్యం చెబుతుంది భయం లేకుండా ఉండమని .......
సంకల్పం చెబుతుంది సాటి లేని మనిషిగా జీవించమని ..........!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, February 22, 2011

AADARSHAM.........!

మనిషి మనసులో ఉన్న మంచులాంటి మంచి భావాలను , నీరుగా మార్చేది మనిషిలోని నీతి లేని మనసు .......
ఆ నీతిలేని మనసు వల్ల నలుగురిలో నవ్వులపాలవటం మంచి మనసుకు నిజంగా నిష్టూరమే.....!
ఆ నీతిలేని మనసు వల్ల మంచి మనసు నీటి సంద్రమైందని,నలుగురిలో నవ్వులపాలు అయ్యిందని .....మన మనసుతో పాటు మనమూ నలిగిపోవడం వ్యర్థం ! ......మనకు ఆనందం ఎక్కునైనా .....బాధ ఎక్కువనా ......కంటినీరు వస్తుంది .....అదే నీరు పాత్రకు అనుకూలంగా మరియు ప్రదేశానికి అనుకూలంగా మారుతుంది  .....నీరు ప్రకృతి అవసరాలను తీరుస్తుంది .......అదే నీరు అవసరమైతే తుఫానును సృష్టిస్తుంది .......మనకు ఆదర్శం నీరే కావాలి.....మీరు అలాగే ఉండాలి....!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, February 20, 2011

NIJA SNEHAM........!

మనసులోని మధుర జ్ఞాపకాలను చెరిపివేసే స్నేహం కన్నా ......
స్నేహం కోసం ప్రాణం ఇచ్చే రూపం మిన్న ......!
సంక్షోభ సహిత స్నేహం కన్నా ....
హృదయ హిత స్నేహం మిన్న .......!
 గత హృదయ గాయాల కన్నా ........
నవీన సద్గుణ స్నేహం మిన్న ....!
అందుకే .....మనిషి కొరకు ఆలోచించక ...
స్నేహం కోరే మనసు కోసం అన్వేషించు ......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.                                     

Saturday, February 19, 2011

MANISHI........!

మథనపడే మనిషికేం తెలుసు ......
తన మనసు మూగదని......?!
ఈ మూగమనసుకేం తెలుసు ....
తన భావాలు మూగవని.......?!
ఈ మూగభావాలకేం తెలుసు .....
అవి ఆకృతి లేని అలలని .......?!
 ఈ  ఆకృతి రహిత అలలకేం తెలుసు .......
అవి అనునిత్యం రూపం కోసం పోరాడేవని......?!
ఈ పోరాడే అలలకేం తెలుసు .....
అవి నిత్యనూతన రూపజనిత సహితాలని........?!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, February 15, 2011

MANAM......!

విజేతలందరూ శ్రమించేవారు కాకపోవచ్చు ......
కాని శ్రమించేవాడు విజేత కావచ్చు ........
నేర్చుకోవడం .......అమలు పరచడం .......
ఓపికతో సరైన దానికోసం ఎదురు చూడడం ......తిరిగిపొందడం ......
దీని కోసమే పుట్టడం ........ఇది ఒక కోణం ........
మాట్లాడటం  .....కేవలం  మాటలు
నిశ్శబ్దం కంటే పదునైనవి అయినప్పుడు....
ఎక్కువగా మాట్లాడటం .....బాధను మౌనంగా .....
మనసులో దాచుకోవడం .......
నిదర్శనం ........
ఫలాలు లేకుండా చెట్టు ఉండగలదు .....
కాని ....వేర్లు లేకుండా ఉండలేదు ........
జీవితం లో కొన్ని సంధర్బాలు.....ఇలా ...!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, February 10, 2011

KUTLET .....!

          నేను మా ఇంటిదగ్గర ఉన్నప్పుడల్లా చేసే పనులల్లో....ప్రతి రెండు రోజులకి ఒకసారి చల్లని సాయంత్రం వేళ  మా ఫ్రెండ్స్ తో కలిసి గప్ చుప్ -కట్లెట్ తినడం ఒకటి . మొదట్లో నాకు ఇలాంటి చిరుతిళ్ళు అంటేనే ఒక భయం ఉండేది. కాని ఒకసారి  వీటిని తయారు చేసేటువంటి చాట్ భండార్ ముందు నుండి వెళుతుండగా ఈ  కట్లెట్ ని  వేడివేడిగా తయారు చేస్తుంటే దాని ఘుమఘుమలు నా ముక్కుపుటాల ద్వారా నా మెదడును చేరి ....ఆ కట్లెట్ రుచిని చూడాలని నా నాలుకను ఉత్సాహపరుస్తూ.....నన్ను రెచ్చగొట్టాయి...!అంతే అప్పటి నుండి నేను ఆ కట్లెట్ కి బానిసని అయ్యాను. ఈ కట్లెట్ నిజానికి చూడటానికి ఒక సినిమా హీరోయిన్ లా ఎంతో అందంగా ఉంటుంది....ఎంత అందంగా ఉంటుందంటే ......ఎప్పటికీ మన దగ్గరే ఉండాలన్నంతగా .....!కట్లెట్ ని తయారుచేస్తున్నపుడు .....అది పెనం పై మసులుతూ ఉంటే....నాకు అది  ఒక కట్లెట్ "లావా" లా కనిపిస్తుంటుంది. అలా మసులుతున్నటువంటి ఆ కట్లెట్ "లావా"ని చూస్తూ ఉంటే దాన్ని అలాగే తినాలనిపిస్తుంది.....కానీ ఏం చేస్తాం.... అలా వేడివేడి కట్లెట్ తింటే ముందు మన నోరు చస్తుంది ....అందుకే అలా  తినాలనే ఆశను ఎప్పుడో చంపేసుకున్నాను .....! అయినా అది నా మూర్ఖత్వం ....ఎవరైనా అలా తయారు చేసేటప్పుడు తిన్నలనుకుంటారా ....?! ......చెప్పండి! ఎలా అయితేనేం మొత్తానికి నేను ఆ కట్లెట్ కి బానిసను అయ్యాను ! అలాగే  ఉంటాను కూడా....! ఎందుకంటే, మనసుకు నచ్చింది ....మనసు కోరుకున్న విషయాన్ని స్వచ్ఛంగా, స్వచ్చందంగా  చేయడం లో తప్పు లేదు ...!    

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Tuesday, February 8, 2011

KALPITHAANUBHUTHI

NOTE:::--- ఇది ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు.....ఇందులోని వర్ణన కాస్త విచిత్రంగా ఉంటుంది.....! ఎవరినైనా నొప్పించినట్లుగా అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించగలరు.....!

                రూమ్ నంబర్ 420.ఇదేదో సెంట్రల్ జైలు రూమ్ కాదు . ఇది నా ఫ్రెండ్ గాడి రూమ్. ఇంతకీ వాడి రూమ్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉందండోయ్ ...!నేను మొదటిసారి వాడి రూమ్ కి వెళ్ళడం ....వాడి రూమ్ ని చూడగానే నాకు ఎదురైన వింత  అనుభూతి నా మదిలో  చరగని జ్ఞాపకాలుగా ఇంకా అలానే ఉన్నాయ్. ఆ చిన్ని కథే ఇది......
              నేను మొట్టమొదటి సారిగా వాడి రూమ్ కి చదువుకోవడానికి వెళ్ళాను. వాడి రూమ్ ఎంత అందంగా ఉందంటే....పాతకాలపు సఫాయి కర్మచారి కాంప్లెక్స్ స్టోర్ రూమ్ లా ఉంది ...క్షమించాలి, నాకు వాడి రూమ్ ని వర్ణించడానికి ఇంతకంటే మంచి అందమైన పదం దొరకడం లేదు..! చాలా మట్టుకు వాడి పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయ్. ఇంకా వాడి బెడ్ పై దుప్పట్లు ఎలా ఉన్నాయంటే ......పిండడానికి బక్కెట్ లో నానబెట్టిన తడి బట్టల్లా ఉన్నాయ్. వాడి రూమ్ మొత్తం చెత్తతో నిండి ఉంది ...!ఒక రకంగా  వాడి రూమ్ ఒక దొంగోడి  రూమ్ లా ఉంది. అందుకే వాడి రూమ్ కి' రూమ్ నంబర్ 420 '..అని పేరు పెట్టాం..!చాలా రోజులవరకి నేను  వాడి రూమ్ కి వెళ్ళలేదు......అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా ...!?
               కాని, ఇప్పుడు వాడి మొత్తం రూమ్ అవతారమే మారింది.ఇప్పుడు వాడి రూమ్ ఎంతో శుభ్రంగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్, వాడి రూమ్ లో ప్రభుత్వ  పథకాలైన పచ్చదనం-పరిశుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమాలను అమలుపరిచాడు......దీనితో మాధురీ దీక్షిత్ , సోనాలి బింద్రే  లాంటి హీరోయిన్లు పోస్టర్ల రూపం లో వాడి రూమ్ లో  సెటిల్ అయ్యారు....ఈ హీరోయిన్లు వాడి రూమ్ కి పెద్ద కళనే తెచ్చారు ...........!

                                                             ఇది మా ఫ్రెండ్ గాడి చిన్న  రూమ్ కథ ......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Sunday, February 6, 2011

NENU-PRAKRUTHI....!

        నేను ఒక అలుపెరుగని బాటసారిని...నా ప్రయాణం ఎటువైపో ఏ దిక్కుకి కూడా తెలియదు ...కాని నాలో ఏదో ఒక మూలన, ఒక చిన్న నమ్మకం - ఎలాగైనా సరే నా గమ్యాన్ని నేను చేరుకుంటానని !కాని ఆ గమ్యాన్ని  చేరుకోవడానికి నాకు ఒక తోడు కావాలి. నాకు అండగా నిలబడాలని నా మనసు ఎంతో బలంగా కోరుకుంటోంది .....ఏం చేయాలో అంతుపట్టని స్థితి. అదే సమయంలో నేనున్నానంటూ .....ఒక తల్లిలా అన్నీ తానై నేర్పుతూ ......నా ప్రయాణానికి ఒక అర్థం ఇస్తూ నాకు అండగా నిలిచింది ఈ ప్రకృతి ....!
         తననే ఒక దైవంగా , ఒక వరంగా, ఒక అలంకారంగా చుసుకొమ్మని చెప్పింది ఈ ప్రకృతి. దాని అర్థం వెతికే పనిలో పడిన నాకు కవిత్వం రూపంలో ఒక దిక్కుగా ......నేను నా గమ్యాన్ని చేరుకోవడానికి సాగించే ప్రయాణానికి ఒక దారిలా కనబడింది. ప్రకృతి నాకు చెప్పినట్లుగానే తనను ఒక దైవంగా ,ఒక వరంగా, ఒక అలంకారంగా తన వర్ణనని మొదలుపెట్టిన నాకు ఈ వర్ణనా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
         కవిత్వంలోని కవ్వింపులను, వింతలను ......కనిత్వం ద్వార మనసుకు చేకూరే తన్మయత్వాన్ని ప్రకృతి నాకు తెలియజేసింది. ప్రకృతి తనలో దాగి ఉన్న అందాన్ని, రమణీయతను, ఆహ్లాదమును మరియు మౌనమును మౌనంగానే నాకు నాయొక్క కావితావస్తువుగా ధారాదత్తం చేసింది. అసలు జీవితం అంటే తెలియని నాకు, నా జీవితాంతం తోడుగా , నా కవితలకి ఒక తొడుగుగా ఉంటానంది ఈ ప్రకృతి...!
        నాకు ప్రకృతి తనలోనుండి పుట్టిన నదుల ద్వార, అలసట మనిషి శరీరానికే కాని, మనసుకి కాదు అని తెలియజేసింది. ఎర్రటి ఎండ  ద్వార ఆవేశం అంటే ఏమిటో తెలిసేలా చేసింది. గాలి తన స్పర్శ ద్వార ఎదుటివారిని ఎలా స్ప్రుశించాలో చెప్పింది. చెట్లు చిగురిస్తూ కొత్తదనాన్ని ఎలా స్వీకరించాలో, అవే చెట్లు ఆకులను రాల్చుతూ విలువలు లేని జీవితం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎలా ఓర్పుతో ఉండాలో ఈ నేల చెప్పింది. ఒక రకంగా నా జీవిత సారాంశం ఈ ప్రకృతే.....!
               అందుకే ఈ ప్రకృతి నుండి ఏర్పడ్డ జీవితం నుండి పుట్టిన నా కవిత్వం ఈ ప్రకృతికే అంకితం.......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Friday, February 4, 2011

MANA KOSAM........!

ప్రకాశించే సూర్యునికేం తెలుసు
ఆ ప్రకాశం ఒక ఆవేశమని.......?!
వెండి వెన్నెలకేం తెలుసు
ఆ వెన్నెల వెలుగు ఒక అందమని ......?!
నీలి నింగికేం తెలుసు
తన చూపు విశాలమని .......?!
కారుమేఘానికేం తెలుసు
తన నీటి చినుకులు అల్లరివని .....?!
అవనికేం తెలుసు
తన నేల ఓర్పుగలదని.....?!
నీ మనసుకేం తెలుసు
స్నేహం ఉన్నది మనకోసమేనని ........?!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

Thursday, February 3, 2011

SNEHAM......!

స్నేహం ఒక అనుభవం
స్నేహం ఒక అనుభూతి
స్నేహం ఒక అనురాగం
స్నేహం ఒక అనుబంధం
స్నేహం  ఒక ఆనందం
స్నేహం ఒక ఆవేశం
స్నేహం ఒక అపురూపం
స్నేహం ఒక ఆహ్లాదం
స్నేహం ఒక అనంతం .......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

SNEHAM KOSAM.......!

దూరమైనా స్నేహం కోసం వెతుకుతుండగా ........
బాధ కన్నీరై గుచ్చుకున్నది...మనసుని .....!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

ANKITHAM.......!

నిండు పౌర్ణమి వెలుగులో .....
నక్షత్రాల చాటున దాగి ఉన్న
ఓ ప్రియ నేస్తమా...నీ కోసమే .....
ఈ జీవితం.......
.............నీకే అంకితం......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

ENDUKU .....?!

కరిగిపోయే కల కోసం ఆశ ఎందుకు ........?!
కన్నీటి కోసం ఆత్రుత ఎందుకు ......?!
కానరాని చూపు కోసం కంగారు ఎందుకు .........?!
కలలు కంటూ ఉంటె ......
కన్నీళ్లు అలలుగా వస్తాయి .....
అవి నెరవేరనప్పుడు .......!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

EMAINDO.....!

ఏమైందో ఏమో ఈ మనసుకి .......
ఏమైందో ఏమో ఈ మాటలకి .........
ఏమైందో ఏమో ఈ చూపులకి ...........
ఏమైందో ఏమో ఈ హృదయ లయలకి ......
ఆచూకి తెలియని .......నీ మనసు కోసం .......
మనిషి తెలియని......... మంచి స్నేహం కోసం .........!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.
జన్మించిన ప్రతి హృదయం స్నేహానికి ఒక వేదిక .......!
ఈ స్నేహ హృదయ వేదిక ఉండాలి ఒక వేడుకగా  ........!
ఈ వేడుక కావాలి ,స్నేహానికి చిరునామాగా ..........!

DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.