Tuesday, June 21, 2011

NAANNA...!!!

    నాన్న ..."నా" అని నేను గర్వంగా చెప్పుకోవడానికి ఈ ప్రపంచం లో నేను బ్రతకడానికి దేవుడు నాకు ప్రసాదించిన రెండు వరాలలో ...మొదటి వరం...!!! నాన్న... ఈ నేలపై నా ప్రయాణం మొదలైన రోజు నుండి నాకోసమై ఉన్నవాడు...నన్ను నడిపిస్తున్నవాడు ...నన్ను నన్నుగా చూస్తున్నవాడు  ...!!! నాన్న...నాకు ప్రేమను మాత్రమే పంచుతూ, బాధను తన దగ్గరే ఉంచుకుంటున్నవాడు ...నా కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ , తన సంతోషాన్ని నాకు పంచి ఇస్తున్నవాడు ...!!! నాన్న ... జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పినవాడు...నా జీవితానికే ఒక అర్థం ఇచ్చినవాడు...!!! నాన్న ...నాకు ఆదర్శంగా నిలిచినవాడు...ఆదర్శానికే ఆదర్శంగా ఉన్నవాడు ...!!! 


DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.