మనం పుట్టిన దగ్గరి నుంచి మనకు తెలిసిన మనకు ప్రీతిపాత్రమైన బంధాలు ప్రేమ రూపంలో, ఆప్యాయతగా ఒక రక్షణగా ఉంటాయి. మనకు ఊహ తెలియని వయసు నుండి మనకు మనంగా పెద్ద మనుషులుగా భావించే స్థితి వరకు చేరుకున్నా.. ఆ బంధాలు మన వెన్నంటే ఉంటాయి. మనం ఒకానొక వయసుకి వచ్చాక ... మనకు తెలియకుండానే, మనవి కాని విషయాలకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రముఖంగా మన ఏకాగ్రతను నిలుపుతాము. వాటినే మన బంధాలుగా, చాలా సందర్భాల్లో మన జీవితాలుగా భ్రమ పడతాము. ఆ భ్రమ ఎంత ప్రభావితంగా ఉంటుందంటే ... మన వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టేస్తాము. కానీ, కొన్ని విషయాలు మన వెన్నంటే ఉండి మనకు అండదండలుగా ఉండి, చివరకు అవి కూడా ఒక బాధగా మారిపోతాయి. అయితే ఇక్కడ లోపం మనది. ఎందుకంటే, ప్రతీ విషయాన్ని అతిగా మనలో మనమే చూసుకోవడం. లోపం మనలో మాత్రమే కాకుండా ఎదుటివారిలో కుడా ఉంటుంది... కారణం, వారు మన శరీరాలను శరీర హావభావాలను గమనిస్తారే కాని... మన ఆలోచనలను గమనించరు. ఈ కాస్త విషయం తెలుసుకునేలోపే ... జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఎంతైనా అనుభవిస్తేగాని తెలిసివచ్చే గుణాలు కావుగా...మనవి!!!
అతిప్రాధాన్యత మరియు ప్రాధాన్యం లేని విషయాలు మూల్యం చెల్లించేవిగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి సుమా ...!!!
అతిప్రాధాన్యత మరియు ప్రాధాన్యం లేని విషయాలు మూల్యం చెల్లించేవిగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి సుమా ...!!!
No comments:
Post a Comment