మన బంధాలు గుండె చప్పుళ్ళ లాంటివి. మన గుండె లబ్ డబ్ అని మోగినట్లుగానే, మన జీవితంలోని బంధాలు ఉంటాయి. హృదయలయల మాదిరిగానే బంధాలు ఒకటి కనుమరుగవుతుండగానే ... మరొకటి వచ్చి చేరుతుంది. మన జీవిత మనుగడకు ఈ హృదయ లయలు ఎంత ముఖ్యమో, మన పాత బంధాలు అంతే ముఖ్యం అని నమ్మే వ్యక్తిని నేను! అలాంటిది ఒక లయ నాకు తెలియకుండానే వెళ్ళడానికి సిద్దపడితే ... కాదనడానికి నేను ఎవరిని ...?! సృష్టింపబడిన నిన్ను నా సృష్టిలో ఒక భాగం చేసుకున్నానే తప్ప నీలో నేను భాగం కాలేదు ... ఇకపై కాబోను కూడా ...!!!
మన జీవితం అయోమయం. ఈ అయోమయ జీవితంలో బంధాలు మరికొంత గందరగోళం సృష్టిస్తాయి. మనం కావాలనుకున్నది మన ఒడిని చేరదు... మనకి దక్కిన దానితో సంతృప్తి చెందము... మనకు ఇష్టంలేనివి సాధారణంగా జరుగుతుంటాయి... ఇదే జీవితమంటే!!!
ఈ అయోమయంలో మన చిరునవ్వును కూడా మరిచిపోతాము ... ఈ బంధాల అతి వలన...! నేనలా ఉండాలనుకోవట్లేదు...! నన్ను విడిచి వెళ్ళిన ఆ బంధాల తీరుతెన్నుల గురించి ఆలోచించి నా మనసుని మూగపరుచలేను...!!!

No comments:
Post a Comment