Thursday, February 10, 2011

KUTLET .....!

          నేను మా ఇంటిదగ్గర ఉన్నప్పుడల్లా చేసే పనులల్లో....ప్రతి రెండు రోజులకి ఒకసారి చల్లని సాయంత్రం వేళ  మా ఫ్రెండ్స్ తో కలిసి గప్ చుప్ -కట్లెట్ తినడం ఒకటి . మొదట్లో నాకు ఇలాంటి చిరుతిళ్ళు అంటేనే ఒక భయం ఉండేది. కాని ఒకసారి  వీటిని తయారు చేసేటువంటి చాట్ భండార్ ముందు నుండి వెళుతుండగా ఈ  కట్లెట్ ని  వేడివేడిగా తయారు చేస్తుంటే దాని ఘుమఘుమలు నా ముక్కుపుటాల ద్వారా నా మెదడును చేరి ....ఆ కట్లెట్ రుచిని చూడాలని నా నాలుకను ఉత్సాహపరుస్తూ.....నన్ను రెచ్చగొట్టాయి...!అంతే అప్పటి నుండి నేను ఆ కట్లెట్ కి బానిసని అయ్యాను. ఈ కట్లెట్ నిజానికి చూడటానికి ఒక సినిమా హీరోయిన్ లా ఎంతో అందంగా ఉంటుంది....ఎంత అందంగా ఉంటుందంటే ......ఎప్పటికీ మన దగ్గరే ఉండాలన్నంతగా .....!కట్లెట్ ని తయారుచేస్తున్నపుడు .....అది పెనం పై మసులుతూ ఉంటే....నాకు అది  ఒక కట్లెట్ "లావా" లా కనిపిస్తుంటుంది. అలా మసులుతున్నటువంటి ఆ కట్లెట్ "లావా"ని చూస్తూ ఉంటే దాన్ని అలాగే తినాలనిపిస్తుంది.....కానీ ఏం చేస్తాం.... అలా వేడివేడి కట్లెట్ తింటే ముందు మన నోరు చస్తుంది ....అందుకే అలా  తినాలనే ఆశను ఎప్పుడో చంపేసుకున్నాను .....! అయినా అది నా మూర్ఖత్వం ....ఎవరైనా అలా తయారు చేసేటప్పుడు తిన్నలనుకుంటారా ....?! ......చెప్పండి! ఎలా అయితేనేం మొత్తానికి నేను ఆ కట్లెట్ కి బానిసను అయ్యాను ! అలాగే  ఉంటాను కూడా....! ఎందుకంటే, మనసుకు నచ్చింది ....మనసు కోరుకున్న విషయాన్ని స్వచ్ఛంగా, స్వచ్చందంగా  చేయడం లో తప్పు లేదు ...!    


DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.

No comments:

Post a Comment