NOTE:::--- ఇది ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు.....ఇందులోని వర్ణన కాస్త విచిత్రంగా ఉంటుంది.....! ఎవరినైనా నొప్పించినట్లుగా అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించగలరు.....!
రూమ్ నంబర్ 420.ఇదేదో సెంట్రల్ జైలు రూమ్ కాదు . ఇది నా ఫ్రెండ్ గాడి రూమ్. ఇంతకీ వాడి రూమ్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉందండోయ్ ...!నేను మొదటిసారి వాడి రూమ్ కి వెళ్ళడం ....వాడి రూమ్ ని చూడగానే నాకు ఎదురైన వింత అనుభూతి నా మదిలో చరగని జ్ఞాపకాలుగా ఇంకా అలానే ఉన్నాయ్. ఆ చిన్ని కథే ఇది......
నేను మొట్టమొదటి సారిగా వాడి రూమ్ కి చదువుకోవడానికి వెళ్ళాను. వాడి రూమ్ ఎంత అందంగా ఉందంటే....పాతకాలపు సఫాయి కర్మచారి కాంప్లెక్స్ స్టోర్ రూమ్ లా ఉంది ...క్షమించాలి, నాకు వాడి రూమ్ ని వర్ణించడానికి ఇంతకంటే మంచి అందమైన పదం దొరకడం లేదు..! చాలా మట్టుకు వాడి పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయ్. ఇంకా వాడి బెడ్ పై దుప్పట్లు ఎలా ఉన్నాయంటే ......పిండడానికి బక్కెట్ లో నానబెట్టిన తడి బట్టల్లా ఉన్నాయ్. వాడి రూమ్ మొత్తం చెత్తతో నిండి ఉంది ...!ఒక రకంగా వాడి రూమ్ ఒక దొంగోడి రూమ్ లా ఉంది. అందుకే వాడి రూమ్ కి' రూమ్ నంబర్ 420 '..అని పేరు పెట్టాం..!చాలా రోజులవరకి నేను వాడి రూమ్ కి వెళ్ళలేదు......అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా ...!?
కాని, ఇప్పుడు వాడి మొత్తం రూమ్ అవతారమే మారింది.ఇప్పుడు వాడి రూమ్ ఎంతో శుభ్రంగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్, వాడి రూమ్ లో ప్రభుత్వ పథకాలైన పచ్చదనం-పరిశుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమాలను అమలుపరిచాడు......దీనితో మాధురీ దీక్షిత్ , సోనాలి బింద్రే లాంటి హీరోయిన్లు పోస్టర్ల రూపం లో వాడి రూమ్ లో సెటిల్ అయ్యారు....ఈ హీరోయిన్లు వాడి రూమ్ కి పెద్ద కళనే తెచ్చారు ...........!
ఇది మా ఫ్రెండ్ గాడి చిన్న రూమ్ కథ ......!
DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.
No comments:
Post a Comment